బ్రేకింగ్ – బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా

బ్రేకింగ్ - బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా

0
65

ఈ క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ‌రిని వ‌ద‌ల‌డం లేదు, ప్ర‌తీ ఒక్క‌రిని భ‌‌య‌పెడుతోంది, సినిమా సెల‌బ్రెటీల నుంచి సాధార‌ణ పౌరుల వ‌ర‌కూ ఇది ఎవ‌రిని వ‌ద‌ల‌డం లేదు.. ఓ ప‌క్క షూటింగులు స్టార్ట్ చేయ‌డంతో చాలా మందికి వైర‌స్ సోకుతోంది.

బుల్లితెర‌లో చాలా మంది ఇప్పుడు వైర‌స్ బారిన ప‌డ్డారు, దీంతో చాలా వ‌ర‌కూ షూటింగుల‌కి బ్రేకులు ప‌డ్డాయి.తాజాగా బిగ్ బాస్-3 కంటెస్టెంట్, ప్రముఖ సీరియల్ హీరో రవి కృష్ణ కరోనా భారిన పడ్డారు. కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆయనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు.

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని గత మూడు రోజుల నుండి ఐసోలేషన్ లోనే ఉంటున్నానని వెల్లడించారు. అయితే త‌న‌తో ఎవ‌రు కాంటాక్ట్ అయ్యారో వారు కాస్త ఐసోలేష‌న్ లో ఉండాలి అని చెప్పారు, త‌న‌కు క‌రోనా పాజిటీవ్ వ‌చ్చింది అయినా పెద్ద ల‌క్ష‌ణాలు లేవ‌ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాను అని తెలిపారు.