బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ ఎవరంటే

బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ ఎవరంటే

0
104

ఇప్పుడు మనకు తెలుగులో బిగ్ బాస్ 4 సీజన్ ఫీవర్ నడుస్తోంది … త్వరలో ఇది కూడా ప్రారంభం అవుతుంది.. ఇప్పటికే మూడు సీజన్లు చాలా ఆసక్తిగా నడిచాయి, ఇక మొదట ఎన్టీఆర్, రెండో సెషన్, నాని, మూడో సెషన్ నాగార్జున హోస్ట్ చేశారు, అయితే ఇప్పుడు టాలీవుడ్ లో తెలుగులో ఏ హీరో హోస్ట్ గా బిగ్ బాస్ 4కి రానున్నారు అనే చర్చ జరుగుతోంది.

టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగి నెంబర్ వన్ రియాల్టీ షోగా కీర్తి గడించింది తెలుగులో బిగ్ బాస్ . ప్రస్తుతం బిగ్బాస్ నాలుగో సీజన్కు రెడీ కాబోతుంది… అయితే ఈ సీజన్లో ఎవరు వ్యాఖ్యాతగా చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది..
మరోసారి తారక్ హోస్ట్ గా చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి, కాని వెను వెంటనే ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ సినిమాలు ఉన్నాయి.. దీంతో ఆయన చేయరు అని తెలుస్తోంది.

దీంతో ఈసారి సరికొత్త పేరు తెరపైకి వచ్చింది. బిగ్బాస్ వ్యాఖ్యాతగా అలరించేందుకు మహేష్ సన్నద్ధమవుతున్నట్లు, అందులో భాగంగా ఒప్పందంపై సంతకం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ నాల్గవ సెషన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది. మరి మహేష్ బాబు ఒకే చేస్తారా లేదా అనేది చూడాలి.