బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఈ వారం గెస్ట్ గా ప్రముఖ హీరో ఎవరంటే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఈ వారం గెస్ట్ గా ప్రముఖ హీరో ఎవరంటే

0
113

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అద్బుతంగా సాగుతోంది, ముఖ్యంగా వీకెండ్ వచ్చింది అంటే మజా మరింత పెరుగుతుంది, అయితే దసరా నుంచి బిగ్ బాస్ హస్ లో టీఆర్పీ గతంలో కంటే పెరిగింది, దసరా స్పెషల్ షో అందరికి నచ్చింది. సమంత హోస్టింగ్ అదరగొట్టింది, ఇక తర్వాత నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇక్కడకు రావడంతో ఇక హోస్ట్ గా ఆయనే కొనసాగుతున్నారు.

ఇక తాజాగా ఈ వారం వీకెండ్ కు ప్లాన్ సిద్దం చేస్తున్నారట..అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో హీరోను గెస్ట్ గా తీసుకురానున్నారట.. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఈ వారం గెస్ట్ గా రానున్నడని ప్రచారం జరుగుతోంది. శని ఆదివారాల్లో జరిగే ఎపిసోడ్స్ కు ఇద్దరు గెస్ట్ లు రానున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఓరోజు చైతూ వస్తే మరో రోజు ఎవరు వస్తారో తెలియాల్సి ఉంది, అయితే వీకెండ్ హైప్ పెంచాలి కాబట్టి కచ్చితంగా టీఆర్పీ విషయంలో బిగ్ బాస్ టీం సరికొత్తగా ప్లాన్ చేస్తోంది. ఇక గత వారం లోకనాయకుడు కమల్ కూడా తెరపై కనిపించారు, ఇప్పుడు చైతూతో పాటు మరో హీరో ఎవరో చూడాలి.