అదరగొడుతున్న తెలుగు బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ – ఎంతంటే

అదరగొడుతున్న తెలుగు బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ - ఎంతంటే

0
101

బుల్లితెర పై సంచలనం సృష్టిస్తోంది బిగ్ బాస్ .. ఇప్పటి వరకూ ఏ సీజన్ లో రాని రేటింగ్ ఈ సీజన్ కు వచ్చింది.. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3 షోలు సూపర్ సక్సస్ సాధించాయి. అయితే ఇప్పటికే తొలి వారం సీజన్ 4 అన్నీ రికార్డులు బీట్ చేసింది.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం వీకెండ్స్ అంటే శని ఆదివారాలే కాదు సోమవారం నుంచి శుక్రవారం కూడా షో టీర్పీ బాగా వస్తోందట, ఓ పక్క ఐపీఎల్ఎఫెక్ట్ ఉంటుంది అని భావించారు అందరూ, అయితే ఐపీఎల్ ఉన్నా బిగ్ బాస్ టీఆర్పీ బాగానే ఉంది అని తెలుస్తోంది.

ఆదివారం 13.6 టీఆర్పీ సాధించింది. శనివారం కూడా ఈ షో కు 9. 64 టీఆర్పీ వచ్చింది.ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ కార్యక్రమాలు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి
దీంతో టీఆర్పీ 10 సాధారణ రోజుల్లో కూడా దాటేస్తోంది అంటున్నారు నిర్వాహకులు. ఈసారి అన్నీ సీజన్స్ కంటే బాగుంది అని అంటున్నారు.