తెలుగు బిగ్ బాస్ లో మనం వినే వాయిస్ ఎవరిదో తెలుసా..?

తెలుగు బిగ్ బాస్ లో మనం వినే వాయిస్ ఎవరిదో తెలుసా..?

0
106

బిగ్ బాస్ తెలుగులో ఎంత హిట్ అయిందో తెలిసిందే, అయితే ఈ షో మిస్ అవ్వరు చాలా మంది , ఈ రియాల్టీ షో ద్వారా చాలా మంది ఫేమస్ అవుతున్నారు, అయితే బిగ్ బాస్ పేరు చెప్పగానే కనిపించని ఓ వ్యక్తి వాయిస్ ఆ హౌస్ లో అందరిని కమాండ్ చేస్తూ ఉంటుంది.

అయితే ఆయన ఎవరు ఎలా ఉంటారు అనేది చాలా మందికి తెలియదు, అయితే ఆయనే బిగ్ బాస్ అని అందరూ అంటారు, మరి ఆ వాయిస్ బేస్ అలా ఉంటుంది, మరి బిగ్ బాస్ వాయిస్ చెబుతున్న ఆయన ఎవరు అనేది చూద్దాం.

మనం రోజూ టీవీలో వినే బిగ్ బాస్ వాయిస్ – వాయిస్ ఓవర్ రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ది. అయితే ముందు బిగ్ బాస్ నిర్వాహకులు చాలా మందిని వాయిస్ టెస్ట్ చేశారు కాని ఎవరిది ఒకే అవ్వలేదు, ఈ సమయంలో బిగ్ బాస్ వాయిస్ కి రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓరోజు చెప్పారు, ఇది బాగా సూట్ అయింది అని ఆయన్ని ఫైనల్ చేశారు.

సీజన్ వన్ నుంచి సీజన్ 4 వరకూ ఆయనే వాయిస్ చెబుతున్నారు..మూడో సీజన్ నుంచి తన గొంతను కాస్త మార్చి కొత్తగా ప్రయత్నిస్తున్నాడు రాధాకృష్ణ.. పలు హిందీ సినిమాలకు ఆయన డబ్బింగ్ చెబుతూ ఉంటారు, అంతేకాదు పలు సీరియల్స్ కు షోలకు ఆయన డబ్బింగ్ చెబుతారు.
హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయిన సిఐడి లాంటి సీరియల్స్కు కూడా డబ్బింగ్ చెప్పారు, నిజమే ఆయన వాయిస్ కు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, మరి మీరు ఆయన వాయిస్ కి ఫ్యానా కామెంట్ చేయండి.