బిగ్ బాస్ 4 – అభిజిత్ రియల్ స్టోరీ

బిగ్ బాస్ 4 - అభిజిత్ రియల్ స్టోరీ

0
93

చూస్తే చాలా సైలెంట్ గా ఉంటాడు, మంచి అందగాడు, ఎవరా అనేంత సౌమ్యంగా ఉంటాడు అతనే బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అభిజిత్, అయితే ఇప్పుడు అతని గురించి చాలా మంది ఎవరు ఈ హ్యాండ్ సమ్ అబ్బాయి అని చూస్తున్నారు . ఇప్పటికే పలు సినిమాలు చేశారు ఆయన మరి ఆయన గురించి కొన్ని విషయాలు చూద్దాం.

అక్టోబర్ 11, 1988 న జన్మించిన అభిజీత్, మదనపల్లిలో రిషివ్యాలీలో చదువుకున్నాడు, తర్వాత హైదరాబాద్ కొంపల్లిలోని మల్లా రెడ్డి కాలేజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేశారు.ఈ సమయంలోనే అతనికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో అవకాశం వచ్చింది.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తర్వాత మిర్చిలాంటి కుర్రోడు చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్తో ఆలరించాడు. ఆ తర్వాత రామ్ లీలా, పెళ్లిగోల వెబ్ సీరీస్లో నటించాడు. అంతేకాదు ఇప్పుడు పలు వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు, సినిమాల్లో కూడా నటించడానికి రెడీ అంటున్నాడు, అయితే ఇప్పడు బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్నాడు. చాలా సౌమ్యంగా సైలెంట్ గా ఉంటూ ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంటున్నాడు.