బిగ్ బాస్ సీజన్ 4లో నలుగురు స్టార్ హీరోలు.. ఇద్దరు యంగ్ హీరోయిన్స్… వీరే..

బిగ్ బాస్ సీజన్ 4లో నలుగురు స్టార్ హీరోలు.. ఇద్దరు యంగ్ హీరోయిన్స్... వీరే..

0
90

బుల్లితెరలో అతిపెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న షో బిగ్ బాస్… సీజన్ వన్ కు స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిచి షోకి మంచి రేటింగ్ తెచ్చేలా చేశాడు.. ఆతర్వాత నాచురల్ స్టార్ నానీ నాచురల్ గా రానించినా సీజన్ 3కి కింగ్ నాగార్జున మసాలా నూరి షోని ట్రెండింగ్ లోకి వచ్చేలా చేశాడు… అయితే ఈ మూడు సీజన్ లలో ప్రతీ షోలో ఒకరిద్దరు హీరోలు ఉంటూనే ఉన్నారు…

శివబాలాజీ, నవదీప్, కౌశిక్, వరుణ్ సందేశ్, తనీష్, ప్రిన్స్ వీరందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లే… వీరందరు ఎవరికి వారు ప్రత్యేకతను నిలుపుకున్నారు… అంతేకాదు ఈ షో ద్వారా అభిమానులను పెంచుకున్నారు… టీవీ తారలు టిక్ టాక్ స్టార్లు ఉన్నా అందరిలోనూ హీరోలు తమ ప్రత్యేకతను నిలుపుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు….

ఇక సీజన్ 4లో కూడా నలుగురు హీరో కంటెస్టెంట్ గా పాటిస్పెట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి… మొత్తం 40 మంది వందరోజులు ఇంట్లో ఉండి సందడి చేయాలి అందులో నలుగురు హీరోలు కనిపించే అవకాశం ఉందని అంటున్నారు… అంతేకాదు వీళ్లతో యాజమాన్యం సంప్రదింపులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఈ నలుగురు హీరోలు ఎవరంటే… కార్తికేయ, సిద్దు జొన్నలగడ్డ, సుధాకర్ కోమకుల, అదితి అరుణ్ లకు ఈ ఆఫర్ వరించిందట… వీల్లతో పాటు ఇద్దరు యువ హీరోయిన్లు సభ్యులుగా ఉంటారని తాజా టాక్….