ఫైన‌ల్- రియాలిటీ షో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీరేన‌ట

ఫైన‌ల్- రియాలిటీ షో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీరేన‌ట

0
96

రియాలిటీ షో బిగ్ బాస్ కు ఎంత ఆద‌ర‌ణ ఉందో తెలిసిందే…తెలుగులో సీజ‌న్ 4 స్టార్ట్ కానుంది, ఇక ఇప్ప‌టికే దాదాపు కంటెస్టెంట్స్ ని ప్ర‌ముఖ హోట‌ల్ కు త‌ర‌లించార‌ట‌, ఎవ‌రి‌కి వారిని సింగిల్ గా ఉంచిన‌ట్లు తెలుస్తోంది, కంటెస్టెంట్స్ కు కూడా ఎవ‌రు హౌస్ లోకి వ‌స్తున్నారు అనేది తెలియ‌దు, ఈ క‌రోనా నేప‌థ్యంలో వారికి ముందు టెస్టులు నిర్వ‌హించి అప్పుడు హౌస్ లోకి పంపేందుకు సిద్దం అవుతున్నారు.

తాజాగా హౌస్ లోకి వెళ్లే వారిలో దాదాపు 20 మంది పేర్లు బయటకు వచ్చాయి. .కృష్ణవేణి సీరియల్ నటుడు సయ్యద్ సోహెల్, మహాతల్లి ఫేమ్ జాహ్మవి, ఆమె భర్త సుశాంత్, జెమినీ టీవీ యాంకర్ ప్రశాంతి, గాయకుడు నోయర్, రఘు మాస్టర్, ఆయన భార్య ప్రణవి, గాయని గీతామాధురి భర్త నందు, జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్, నటి కల్యాణి, యాంకర్, జోర్దార్ ఫేమ్ సుజాత, టిక్ టాక్ స్టార్ మెహబూబా దిల్ సే, దేత్తడి హారిక, కెవ్వు కామెడీ యాంకర్ అరియానా గ్లోరీ, టీవీ 9 యాంకర్ దేవి..హీరోయిన్ పూనమ్ బాజ్వా, వడ్లమాని ప్రియ, యామినీ భాస్కర్, అపూర్వ, అకిల్ సార్థక్ ఫైన‌ల్ అయ్యాయ‌ట‌. అయితే ఇందులో 15 మందిని ఫైన‌ల్ చేస్తార‌ట‌.

అయితే వీరు అంద‌రికి మ‌ళ్లీ క‌రోనా టెస్టులు చేస్తారు, అంద‌రికి నెగిటీవ్ వ‌స్తే వారిని హౌస్ లోకి పంపిస్తారు, ఆ త‌ర్వాత ఎవ‌రైనా వైర‌స్ బారిన ప‌డితే రెండు మూడు రోజుల్లో వారి ప్లేస్ లో మ‌రొక‌రికి పంపే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌, మ‌రి అధి‌కారిక ప్ర‌క‌ట‌న రావాల్సిఉంది.