బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 హోస్ట్ ఈసారి ఎవ‌రంటే ? స‌రికొత్త పేరు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 హోస్ట్ ఈసారి ఎవ‌రంటే ? స‌రికొత్త పేరు

0
83

బుల్లితెర‌లో బిగ్ బాస్ కు ఉన్నంత క్రేజ్ దేనికి లేదు, ఇక తెలుగులో సీజ‌న్ ఫోర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు, మ‌రీ ముఖ్యంగా ఈ సీజ‌న్ 4 గురించి గ‌డిచిన మూడు నెల‌లుగా చ‌ర్చ జ‌రుగుతోంది, అయితే కంటెస్టెంట్స్ గురించి ఓ లిస్ట్ వైర‌ల్ అవుతోంది.

అయితే దీనిపై ఇంకా ఎవ‌రూ ఫైన‌ల్ గా చెప్ప‌లేదు, ఇక బిగ్ బాస్ టీం కూడా ఎక్క‌డా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు, ఈ స‌మ‌యంలో హోస్ట్ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. తార‌క్ , నాని, నాగార్జున చేశారు ఇప్ప‌టికే. అయితే సీజ‌న్ 4కి మ‌ళ్లీ నాగార్జున చేస్తారు అని వార్త‌లు వ‌చ్చాయి.

త‌ర్వాత రానా పేరు వినిపించింది అయితే ఈసారి హీరోయిన్ స‌మంత పేరు వినిపించింది. కాని వారెవ్వ‌రూ కాదు అని తెలుస్తోంది, అయితే ఇప్పుడు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు వినిపిస్తోంది, కాని దీనిపై విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. మ‌రి చూడాలి అస‌లు ఈసారి షో ఉంటుందా? ఉంటే దానికి హోస్ట్ ఎవ‌రు ? కంటెస్టెంట్స్ ఎవ‌రు అనేది.