చివరి దశలో బిగిల్‌

చివరి దశలో బిగిల్‌

0
95

అట్లి దర్శకత్వంలో ‘తలబది’ విజయ్‌ హీరోగా ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘బిగిల్‌’. కొన్ని సంవత్సరాలుగా విజయ్‌ తన చిత్రాలను దీపావళికి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను కూడా అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు తెచ్చి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. చెన్నైలో భారీ బడ్జెట్‌తో ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ ముత్తురాజ్‌ దీన్ని నిర్మించారు. ఇక్కడే కొన్ని రోజులుగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చాలావరకు సన్నివేశాలు రైల్వేస్టేషన్‌లో జరుగుతున్నందువల్ల ఈ సెట్‌ను వేసినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

వివేక్, యోగిబాబు, ఆనంద్‌రాజ్, దేవదర్షిణి తదితరులు ఇతర తారాగణం. విజయ్‌కి తమ్ముడిగా ‘పరియేరుం పెరుమాల్‌’ ఫేం కదిర్‌ నటిస్తున్నారు. ‘సింగపెన్నే..’ అనే సింగిల్‌ ట్రాక్‌ను ఇటీవల విడుదల చేశారు రెహ్మాన్‌. ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెలాఖరులో చిత్రీకరణ పూర్తయ్యే అవకాముందని సమాచారం.