బింబిసార పార్ట్‌ 2 లో ఎన్టీఆర్ లేడంటూ కళ్యాణ్ రామ్ క్లారిటీ..

0
100

నందమూరి కల్యాణ్‌ రామ్‌ తాజాగా నటిస్తున్న సినిమా బింబిసార. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ తిరుపతిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ”బింబిసార కథ బాగా నచ్చింది. దర్శకుడు వశిష్ట కథ చెప్పినప్పుడు సినిమా చేయాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి జానపద సినిమాలు, సోషియో ఫాంటసీ సినిమాలు చేయాలని కోరిక ఉండేది. తాత గారి సినిమాలు చూస్తూనే పెరిగాను. బింబిసార ఓ సోషియో ఫాంటసీ మూవీ.

రెండో భాగంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండరు. అవన్నీ అభిమానుల ఊహాగానాలు. పార్ట్ 2 కథ ఆల్రెడీ రెడీ అయిపొయింది. బడ్జెట్ కు ఎక్కడా వెనుకాడ లేదు. అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేశాం. ఇంకో రెండు కొత్త సినిమాలు కూడా చేస్తున్నాను. బింబిసార పార్ట్ 2తో కూడా ఆగను. భవిష్యత్తులో మల్టీస్టారర్ సినిమాలు చేస్తాను అవకాశం వస్తే. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని మేజర్, విక్రమ్ సినిమాలు నిరూపించాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది” అని తెలిపారు.