“బింబిసార” ట్రైలర్ రిలీజ్..కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం (వీడియో)

0
103

నందమూరి కల్యాణ్‌ రామ్‌ తాజాగా నటిస్తున్న సినిమా ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

తాజాగా ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.  ట్రైలర్ లోని విజువల్స్, యాక్షన్, ఎలివేషన్ షాట్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న అంటే.. మహా చక్రవర్తి బింబిసార ఏలిన రాజ్యానికి’ అంటూ మొదలైన ఈ ట్రైలర్ లో భారీ యాక్షన్ విజువల్స్ తో పాటు కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం ఆకట్టుకుంది.

ట్రైలర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=53&v=gpb2H-WWfBE&feature=emb_title

ఇక్కడ రాక్షసుడైన భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే అంటూ భారీ డైలాగులతో మెప్పించారు. ‘రాక్షసులు ఎరుగని రావణ రూపం, శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం అంటూ బింబిసార విశ్వరూపాన్ని ఈ ట్రైలర్ లో బాగా ఎలివేట్ చేశారు. మొత్తానికి ఈ సినిమాతో రామ్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.