స్టార్ హీరో సినిమాలో నటించే బంపరాఫర్ కొట్టేసిన బిగ్ బాస్ విన్నర్ బిందుమాధవి..

0
113

స్టార్ హీరో బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్ల నుండి ముద్దుగుమ్మల వరకు అందరితో ఆడిపాడిన ఈ హీరో తాజాగా బిగ్ బాస్ విన్నర్ బిందుమాధవికి సినిమాలో నటించే మంచి అవకాశం కల్పించడానికి ఒకే చెప్పాడు అనిల్ రావిపూడి. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షోలో ఆడపులిలా పంజా విసిరి అందరిని ఓడించి టైటిల్ ను గెలుచుకుంది.

బిగ్ బాస్ హౌజ్ లో గెలిస్తే టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయనేది అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది అలా అవకాశాలు దక్కించుకున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఓటీటీలో 84 రోజుల పాటు నడిచిన రియాలిటీ షో లో అనేక మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. చివరకు బిందుమాధవి, అఖిల్ మధ్య గట్టిపోటీ జరిగిన అనంతరం ప్రేక్షకులు అధిక ఓట్లతో టైటిల్ సొంతం చేసుకుంది.

విన్నర్ గా నిలిచిన బిందు మాధవికి వెంటనే సినిమా అవకాశం దక్కింది. బింధుమాధవి కోసం తను ఓ పాత్రను సిద్ధం చేస్తానని, అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య సినిమాలోనే ఆ పాత్ర ఉండేలా ట్రై చేస్తానని అనీల్ రావిపూడి హామీ ఇచ్చాడు. చూడాలి మరి బిగ్ బాస్ లో తన సత్తా చాటుకున్నట్టుగానే సినిమాలో కూడా ఎలాంటి రికార్డ్స్ సృష్టించబోతుందో.