టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు… ఉదయం ఏడు గంటలకు ఆయన గుంటూరులోని తన స్వగృహంలో బాత్ రూమ్ లో కుప్పకూలారు… ఆయన సినిమాల్లో అరుదైన పాత్ర పోషించారు… కరోనా వల్ల షూటింగ్ లేక గుంటూరులోని తన స్వగృహంలో ఉంటున్నారు… రాయలసీమ యాసతో ప్రజలను అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..
వ్యక్తిగత జీవితం…
ఈయన కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడురు. తండ్రి సాంబిరెడ్డియాదృచ్ఛిక పేజీ సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు. నెల్లూరులోని పత్తేకాన్ పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివారు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్ ఎస్ ఎల్ సీలో చేరారు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. తండ్రి కూడా నటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు. తండ్రీ కొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు. చదువులోనూ ముందుండే వాడు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు
నటజీవితము
అనంతపురంలోని పాఠశాలలో చదివేటపుడు అక్కడి టీచర్లందరూ ఆచార్యులే. గుండాచారి అని సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్‌కి హెడ్‌గా పనిచేసేవారు. కళలపై ఆయనకున్న అభిమానం ఇతనిపై చాలా పనిచేసింది. ఎంతంటే ఒకరోజు ఇతడు, ఇతడి స్నేహితుడు దుర్యోధన గర్వ భంగం అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి ఆయన దగ్గరకెళ్లి టపటపా అప్పజెప్పేశారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఆయన చాలా కోపంగా ‘మళ్లీ నాటకాల పేరెత్తితే తన్నేస్తాను వెధవల్లారా.. అంటూ అరిచారు. ఇతడి స్నేహితుడు లైట్‌గా తీసుకున్నాడు గానీ.. ఇతడు మాత్రం చాలా ఫీలయ్యారు. మూడురోజులు బెంగపెట్టుకున్నారు. ఆ బాధ, కసి కారణంగానే నటనను వృత్తిగా స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.
సినీ రంగ పరిచయము…
ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశారు. అలా ఈయన 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు. కానీ 1997 లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించి పండించిన నటుడు జయప్రాకాశ్ రెడ్డి