బీజేపీలో చేరికపై హీరో విశాల్ క్లారిటీ….

బీజేపీలో చేరికపై హీరో విశాల్ క్లారిటీ....

0
138

తమిళ స్టార్ హీరో విశాల్ బీజేపీలో చేరుతారంటూ కొద్దికాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… అయితే ఈ వార్తలపై విశాల్ క్లారిటీ ఇచ్చాడు… కొద్దికాలంగా తాను బీజేపీలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని చెప్పాడు విశాల్…

తాను బీజేపీలో చేరే ప్రసక్తేలేదని తెలిపాడు… కాగా విశాల్ జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ లో ఉప ఎన్నికల బరిలో నిలిచి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.. అయితే చివరి నిమిషంలో ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు…

తాజాగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సిద్దమవుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది… ఈక్రమంలో సోషల్ మీడియాలో స్థానిక మీడియాలో హీరో విశాల్ బీజేపీలో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి… ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చి పుకార్లకు చెక్ పెట్టాడు…