హాలీవుడ్ బ్లాక్ పాంథర్ హీరో క‌న్నుమూత – ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు

హాలీవుడ్ బ్లాక్ పాంథర్ హీరో క‌న్నుమూత - ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు

0
85

సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు ఈ మ‌ధ్య కొంద‌రు మ‌ర‌ణిస్తున్నారు, ఇది జీర్ణించుకోలేని విష‌యం అనే చెప్పాలి. హాలీవుడ్ స్టార్ హీరో చాడ్విక్ బోస్మాన్ హఠాత్తుగా మృతి చెందడం సినీ ప్రపంచాన్ని మరింత షాక్ కి గురి చేస్తోంది. చిన్న వ‌య‌సులోనే ఆయ‌న మ‌ర‌ణించారు. ఇది అభిమానుల‌కి తీవ్ర విషాదం నింపింది.

స్టార్ చాడ్విక్ బోస్మాన్ క్యాన్సర్ తో పోరాడి చివరకు ప్రాణాలు విడిచాడు. 2016 నుంచి ఆయ‌న పెద్దప్రేగు క్యాన్సర్‌ తో ఒక యుద్ధమే చేస్తున్నాడు. ప‌లు చోట్ల చికిత్స తీసుకున్నా ఆయ‌న‌కు న‌యం కాలేదు,శుక్రవారం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు దాదాపు ఆశలు వధులుకోవాల్సి వచ్చింది.
ఆయ‌న వ‌య‌సు 43 సంవత్సరాలు.

మార్వెల్ స్టూడియోస్ లో సూపర్ హీరోగా నటించడానికి ముందు, బోస్మాన్ కెరీర్ మొదట బ్లాక్ అమెరికన్ ఐకాన్స్ జాకీ రాబిన్సన్, జేమ్స్ బ్రౌన్ చిత్రాలతో మంచి క్రేజ్ అందుకున్నాడు.ఇక ఆయ‌న ఆరోగ్యం బాగా లేక చివ‌రి వ‌రకు కుటుంబంతోనే ఉన్నారు…2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది.