బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఈ కరోనా లాక్ డౌన్ వేళ కొన్ని వేల మందికి సాయం చేశాడు, సినిమాల్లో విలన్ అవ్వచ్చు
కాని ఆయన రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనే చెప్పాలి, ఇక ఆయన అందుకే విలన్ పాత్రలు చేయద్దు అని హీరోగా సినిమాలు చేయాలి అని అభిమానులు కోరుతున్నారు.. ఈ లాక్ డౌన్ వేళ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి పేదలకు సేవలు చేశాడు
సోనూసూద్.
దేశంలో అందరూ ఆయనని అభినందించారు తాజాగా ఇప్పటికీ ఆయన ఇలా సేవ చేస్తూనే ఉన్నారు…తను పుట్టిన ప్రాంతం పంజాబ్లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ రిక్షాలు అందించాడు. మొత్తం దేశంలో ఇలా 150 మందికి ఈ రిక్షాలు ఇవ్వాలి అని భావించారట… ఇలా ఇవ్వడం వల్ల కొంత మందికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది అని తెలిపారు.
ఇక మీరు సాయం చేసే స్దితిలో ఉంటే కచ్చితంగా పేదలకు నిరాశ్రయులకి ఉద్యోగం లేని వారికి సాయం చేయండి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్ సచార్ పాల్గొన్నారు. ఇక ఆయన చేసిన పనికి సోషల్ మీడియాలో అందరూ అభినందిస్తున్నారు.