పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ చిత్రం పూర్తి అయింది…ఇక మరో రెండు చిత్రాలు సెట్స్ పై పెట్టారు.. తాజాగా క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ను హీరోయిన్గా తీసుకున్నారు…ఇక తాజాగా మరో వార్త వినిపిస్తోంది. ఈ స్టోరీలో ఓ కీలక పాత్ర ఓ యువరాణి రోల్ ఉంటుందట అందులో నిధి నటిస్తుంది అని తెలుస్తోంది.
ఈ చిత్రంలో పవన్ వజ్రాల దొంగగా కనిపిస్తారట. అయితే ఇక్కడ మరో హీరోయిన్ కూడా నటించే ఛాన్స్ ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ను ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ శ్రీలంక భామ గతంలో జూనియర్ ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా చిత్రంలో స్పెషల్ సాంగ్లో కూడా నటించింది.
అయితే తాజాగా ఈ వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. ఇది ఇంకా అఫీషియల్ గా ప్రకటన రాలేదు.. చర్చలు జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్ 9న థియేటర్లలో రానుంది, అలాగే పవన్ కల్యాణ్ రానాతో కలిసి మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.