Sara Ali Khan | పొలిటీషియన్ కుమారుడితో సారా అలీఖాన్ డేటింగ్..!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్(Sara Ali Khan).. ఓ పొలిటీషియన్ కుమారిడితో డేటింగ్‌లో ఉంది. ప్రస్తుతం బీటౌన్‌లో తెగ వినిపిస్తున్న టాక్ ఇదే. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అమ్మడు షికార్లు చేస్తోందని, అందులో భాగంగానే తాజాగా కేదార్‌నాథ్ పర్యటనకు వెళ్లిందని బీటౌన్ అంతా కోడై కూస్తోంది. ప్రముఖ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో సారా అలీఖాన్ కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తోందని రూమర్లు వినిపిస్తున్నాయి. పంజాబ్‌కు చెందిన బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా కుమారుడే ఈ అర్జున్ ప్రతాప్ బజ్వా. అర్జున్ మినహా కుటుంబీకులంతా రాజకీయాల్లోనే ఉన్నారు. వీరిద్దరి పరిచయం ఎక్కడ జరిగిందే తెలీదు కానీ.. వీరి మధ్య ప్రేమాయణం మాత్రం చాలా ఘాటుగా సాగుతోందని బీటౌన్లో వినిపిస్తున్న మాట.

- Advertisement -

ఇటీవల సారా అలీఖాన్.. కేదార్‌నాథ్‌కు వెళ్లింది. అదే సమయంలో అర్జున్(Arjun Bajwa) కూడా కేదార్‌నాథ్ వెళ్లడం, వీరిద్దరు కలిసి దర్శనం చేసుకోవడమే ఈ రూమర్లకు పునాది వేసింది. ఈ పర్యటనలో వారిద్దరు మరింత క్లోజ్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సారా అలీఖాన్(Sara Ali Khan) కానీ అర్జున్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే మౌనం అంగీకారం సూచకం అన్నట్లుగా వారి మౌనాన్ని ఆమోద ముద్ర భావిస్తున్నారు చాలా మంది. మరికొందరు మాత్రం సెలబ్రిటీలకు ఇలాంటి రూమర్లను వినడం కొత్తేమీ కాదని, దీనిపై స్పందించి ఇంకా సమస్యను పెద్దది చేసుకోవడం ఇష్టం లేకనే సారా అలీఖాన్ స్పందించలేదని అంటున్నారు. మరి చూడాలి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Read Also: దీపావళి వేళ ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ గెలుపు ప్రాంతీయ పార్టీలే కారణం: కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్...

KTR | ‘కాంగ్రెస్ ఓటమికి రేవంత్ తప్పుడు ప్రచారమే కారణం’

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).....