ఘనంగా వివాహం చేసుకున్నబాలీవుడ్ జంట..

0
124

రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. కరోనా సంక్షోభం వల్ల వరుస సినిమాల షూటింగ్స్ వల్ల తమ పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు వచ్చి..ఎట్టకేలకు గురువారం బాంద్రాలోని వాస్తులో ఘనంగా పెళ్ళి జరిగింది.

ఈ పెళ్ళికి అతితక్కువ మందిని ఆహ్వానించడం వల్ల చాలామంది సెలబ్రిటీలు వీళ్ళ పెళ్ళి చూడలేకపోయారు. కేవలం అయాన్ ముఖర్జీ, కరీనా – సైఫ్ కపుల్, కరణ్ జోహార్ , ఆకాశ్ అంబానీ తో పాటు ఇంకొందరు మ్యారేజ్ కు హాజరయ్యారు. చివరకు ఇద్దరు ఒక్కటవ్వడంతో ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆలియా రణ్ బీర్ రియల్ లైఫ్ కపుల్ అయిన సందర్భంగా వారికీ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంటిలోకి వెళ్లే క్రమంలో రణ్ బీర్ కపూర్ ఆలియా భట్ ను అమాంతంగా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.