బాలీవుడ్ కు మహేష్ ఎంట్రీ దర్శకుడు ఎవరంటే

బాలీవుడ్ కు మహేష్ ఎంట్రీ దర్శకుడు ఎవరంటే

0
97

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు.. మహేష్ నటించిన సినిమాలలో ప్రతి పాత్ర అభిమానులను ఆకర్షించే విధంగా ఉంటుంది.. టీవీ యాడ్స్ కూడా చాలా ఆకట్టుకుంటాయి..ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రిన్స్ కు క్రేజ్ వుంది..

ఇటీవల ఒక యాడ్ షూటింగ్ చేయడానికై ముంబై కి వెళ్ళాడు మహేష్.. ఈ షూటింగ్ లో బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ నడియావాలా ఆయనని కలిశారు.. సాజిద్ నడియావాలా ఒక మల్టీ స్టారర్ మూవీ తియ్యబోతున్నానని ఈ సినిమా లో ఒక హీరో రణవీర్ సింగ్ అని కూడా చెప్పారట..

గతంలో ఒక కంపెనీ యాడ్ రణవీర్ సింగ్, అలాగే మహేష్ కూడా కలిసి నటించిన విషయం తెలిసిందే.. ఇలా కలిసి యాడ్ చేయడం మూడవసారిగా తెలుస్తోంది.. బాలీవుడ్ లో రణవీర్ కు చాలా ఫాలోయింగ్ వుంది .. అయితే ఈ మూవీ ప్లానింగ్ భారీ స్థాయిలో ఉంటుందని చెప్పారట.. ఈ సినిమా లో మహేష్ నటించాలని కోరారట..

ఇక మహేష్ , రణవీర్ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఆ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది.. ఈ సినిమా డైరెక్టర్ హీరోలకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చారట .. గతంలో మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలు చెయ్యనని చెప్పిన విషయం తెలిసిందే.. కానీ ఈ సినిమా మహేష్ చేస్తాడా లేదా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.