బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు శ్వాససమస్య రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, కొద్ది రోజులుగా ఇంటిలోనే ఉంటున్నారు.
దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.గత నెలలోనూ దిలీప్ కుమార్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరి, రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఈ వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. ఆయన క్షేమంగా కోలుకుని రావాలని ప్రతీ ఒక్కరు ప్రార్ధనలు చేస్తున్నారు.
ఇక కరోనా సమయంలో ప్రతీ ఒక్కరికి ఆయన జాగ్రత్తలు చెప్పారు. ఎవరూ బయటకు రావద్దని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలిపారు. ఆయన క్షేమంగా కోలుకుని ఇంటికి వెళ్లాలని దేశంలో ఉన్న సినిమా అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.