బాలీవుడ్ లో అపరిచితుడు సినిమా రీమేక్ – హీరో ఎవరంటే బీ టౌన్ టాక్

బాలీవుడ్ లో అపరిచితుడు సినిమా రీమేక్ - హీరో ఎవరంటే బీ టౌన్ టాక్

0
88

శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు చిత్రం ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో తెలిసిందే.. దేశ వ్యాప్తంగా ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకున్నారు… విక్రమ్ కెరియర్ ని మార్చేసింది ఈ చిత్రం …ఈ సినిమాకి కథ కథనం హీరో నటన అన్నీ అద్బుతంగా సెట్ అయ్యాయి… చాలా సెంటర్లలో వంద రోజులు పైనే ఆడింది ఈ చిత్రం.

 

సమాజంలో అడుగడుగునా అవినీతి .. నిర్లక్ష్యం ఎలా ఉన్నాయనే విషయాన్ని తెరపై శంకర్ ఆవిష్కరించిన తీరు ప్రతీ ఒక్కరికి నచ్చింది… కలెక్షన్ల మోత మోగించింది, పలు భాషల్లో అందరూ ప్రేక్షకులకి ఈ చిత్రం నచ్చింది, అయితే తాజాగా ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

మరి బాలీవుడ్ లో ఈ సినిమా పై ఎవరు ఫోకస్ చేశారు అంటే యంగ్ హీరో రణ్వీర్ సింగ్ దృష్టి పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇటీవల దర్శకుడు శంకర్ తో ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది, అయితే ఈ సినిమాని శంకర్ తెరకెక్కిస్తారు అని బీ టౌన్ వార్తలు వినిపిస్తున్నాయి… అయితే చరణ్ తో సినిమా అనౌన్స్ చేశారు ఈ సినిమా పూర్తి అయ్యాక బాలీవుడ్ లో ఈ సినిమా ఉంటుంది అని తెలుస్తోంది… వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమా సెట్స్ పైకి వెళ్లవచ్చు అని బీ టౌన్ టాక్.