Poonam Pandey | స్టేడియంలో నగ్నంగా తిరుగుతానన్న నటి మృతి

-

బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. వివాదాస్పద నటి, మోడల్ పూనం పాండే(Poonam Pandey) కన్నుమూసింది. 32 ఏళ్ల ఈ నటి క్యాన్సర్ వ్యాధి కారణంగా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఈరోజు ఉదయం ఆమె మృతి చెందినట్లు పూనమ్ పాండే సోషల్ మీడియా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పూనమ్ పాండే ఇన్స్స్టాగ్రామ్ లో ఓ పోస్టును పెట్టారు. “ఈరోజు ఉదయం పూనం సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మృతి చెందారని తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాము. ఆమె తనతో ఉన్నవారిని చాలా ప్రేమతో, దయతో చూసుకున్నారు. ఆమె జ్ఞాపకాలని స్మరించుకుంటున్న సమయంలో ఎవరూ ప్రైవసీ కి భంగం కలిగించరని ఆశిస్తున్నాం” అని రాసుకొచ్చారు.

- Advertisement -

కాగా, పూనమ్ మరణ వార్తతో ఆమె కుటుంబంలో, అభిమానుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మోడల్ అయిన పూనమ్ 2013 లో నషా సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆమె సినిమాలకంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే బాగా పాపులర్ అయ్యారు. 2011లో ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే టీమ్ ఇండియా కోసం స్టేడియం లో నగ్నంగా తిరుగుతానంటూ ఆమె చేసిన శపథం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యాఖ్యలతో ఆమె ఇప్పుడు కూడా అందరికీ గుర్తుండిపోయింది. పూనమ్(Poonam Pandey) నటనతో పాటు బోల్డ్ ఫోటో షూట్స్ తో కుర్రకారుని బాగా ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో బాగా ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఏదేమైనా చిన్న వయసులోనే క్యాన్సర్ కారణంగా మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది.

Read Also: మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...