బాలీవుడ్ రియల్ హీరో సోనూసూద్.. టాలీవుడ్ రియల్ హీరో ఆయనే… భారీ సహాయం…

బాలీవుడ్ రియల్ హీరో సోనూసూద్.. టాలీవుడ్ రియల్ హీరో ఆయనే... భారీ సహాయం...

0
95

సినీ హీరో మంచు మనోజ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ అభాగ్యుడికి అండగా వైద్యం చేయించేందుకు ముందుకొచ్చాడు. ఓ బాబు బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని ఆ బాలుడికి వైద్యం చేయించేందుకు తల్లిదండ్రుల దగ్గర అంత స్థోమత లేదని సోనూ సూద్ కి నెటిజన్ ఒక్కరు ట్వీట్ చేశారు.

అందులో ఆ అబ్బాయి తండ్రి నేను ఆటో డ్రైవర్ అని నా దగ్గర వైద్యం చేయించే స్తోమత లేదని సహాయం చేయాలని విలపిస్తూ వేడుకున్నట్లు ఉంది. వెంటనే మానవత్వంతో స్పందించిన మంచు మనోజ్ బాబు తండ్రికి భరోసా కల్పించాడు…

ధైర్యంగా ఉండమని సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. వెంటనే హాస్పిటల్ వివరాలు తెలపాలంటూ రీ ట్వీట్ చేశారు. దాంతో నెటిజన్లు దానకర్ణుడు మరో సోనూసూద్ అంటూ కొనియాడారు.