రకుల్ కు సర్ఫ్రైజ్ గిఫ్ట్ పంపించిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

0
91

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ అతి కొద్ది కాలంలోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. ఇటు తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఆమెకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తనకు తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీలలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయని తెలిపింది. మొత్తానికి షూటింగులతో బిజీగా ఉంది ఈ అమ్మడు.

తాజాగా రకుల్ కు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సర్ఫ్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఆ గిఫ్ట్ ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పంచుకుంది రకుల్ .గత ఏడాది మాత్రం కోవిడ్ టెస్టులు నిర్వహించిన రెండు మూడు రోజుల తర్వాత ఫలితం వచ్చేది. కానీ ఇప్పుడు కరోనా టెస్టింగ్ కిట్స్తో సొంతంగానే కోవిడ్ నియంత్రణ పరీక్షలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెస్టింగ్ కిట్స్ మార్కెట్లోకి వచ్చాయి.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన స్టాఫ్ తోపాటు, సినిమా ఇండస్ట్రీలోని చాలా మందికి ఈ కోవిడ్ టెస్టింగ్ కిట్స్ ను కానుకగా అందిస్తున్నారు. అలాగే రకుల్ కి కూడా పంపించారు. మై ల్యాబ్ వారి కోవిసెల్ఫ్ కిట్ ను అక్షయ్ కుమార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు పంపించారు. ఈ కిట్ ని చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా రకుల్ అక్షయ్ కు కృతజ్ఞతలు తెలిపింది.