Flash News- బాలీవుడ్ స్టార్ హీరోకు కరోనా..అభిమానుల్లో ఆందోళన

0
93

బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్‌ చేశారు. ఈ విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పలువురు ట్విట్టర్​ వేదికగా స్పందించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా ఆయన కరోనా బారిన పడడం ఇది రెండోసారి.