షాకింగ్..సినిమాలకు గుడ్ బై చెప్పనున్న బాలీవుడ్ స్టార్ హీరో

0
92

బాలీవుడ్ హీరోల్లో మంచి ప్రత్యేకత సంపాదించుకున్న వాళ్ళల్లో అమీర్ ఖాన్ పేరు తప్పకుండా ఉంటుంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమీర్ ఖాన్ సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. మంచి కథలను ఎంచుకుంటూ మంచి హిట్ లు కొడుతూ ఉంటారు. బాలీవుడ్‌ను ఏలుతున్న ఖాన్ త్రయంలో కీలక వ్యక్తి అమీర్ ఖాన్.

కానీ తాజాగా అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో సినిమాలకు శాశ్వత వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అమీర్ ఖాన్ సినిమాలకు కానున్నాడనే వార్త అభిమానుల్ని షాక్‌కు గురి చేస్తోంది. బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ త్వరలో సినిమాలకు దూరం కానున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఎందుకంటే పిల్లలకు ఎక్కువ సమయం వెచ్చించాలనే ఆలోచనతో త్వరలో సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నట్టు చెప్పాడు.

సినిమాల కారణంగా పిల్లలకు సమయం వెచ్చించలేకపోతున్నట్టు అమీర్ ఖాన్ తెలిపాడు. ఏ సమయంలో ఏమివ్వాలనేది అర్ధం కావడం లేదని చెప్పారు.కుటుంబానికి..తనకు మధ్య సినిమాల కారణంగా గ్యాప్ పెరిగిపోతోందని స్పష్టం చేశాడు. ఈ వాస్తవం అర్ధమయ్యేందుకు ఇంతకాలం పట్టిందన్నాడు. అందుకే త్వరలో 3-4 ఏళ్ల తరువాత ఇండస్ట్రీ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని తెలిపాడు అమీర్ ఖాన్. సూపర్ హిట్ సినిమాలతో అందర్నీ అలరించిన అమీర్ ఖాన్..ఇక వెండితెరకు దూరం కానున్నాడనే వార్త అభిమానుల్ని షాక్‌కు గురి చేస్తోంది.