Javed Akhtar | దక్షిణాది హీరోలను కించపరిచిన బాలీవుడ్ రచయిత..

-

భారతదేశ సినీ పరిశ్రమను ప్రస్తుతం దక్షిణాది సినిమాలు ఏలుతున్నాయి. బాలీవుడ్ సినిమాలకు కూడా రాని కలెక్షన్లు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలకు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్లు కలగన్న కలెక్షన్లను దక్షిణాది రాష్ట్రాల సినిమాలో అలవోకగా అందుకుంటున్నాయి. బాలీవుడ్ నటులు, హీరోయిన్‌లు కూడా దక్షిణాది సినిమాల్లో నటించే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా ఇండియా సినిమా ప్రపంచాన్ని దక్షిణాది రాష్ట్రాలు ఏలుతుండటాన్ని చూసి బాలీవుడ్ రచయిత జావేద్(Javed Akhtar) తట్టుకోలేకపోతున్నారు. అందుకే దక్షిణాది హీరోలు, సినిమాలపై అక్కసు వెళగక్కుతున్నాడు. వారంతా ముక్కు, మొఖం తెలియని హీరోలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాటలు ప్రస్తుతం తీవ్ర రచ్చకు దారితీస్తున్నాయి.

- Advertisement -

తాజాగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌తో(Aamir Khan) కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో జావేద్(Javed Akhtar) పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సౌత్ లో ముక్కు, మొహం తెలియని హీరోల సినిమాలు హిందీలో రూ. ఐదారు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. కానీ, మన సినిమాలు ఆదరణ పొందలేకపోతున్నాయి. ఇది చాలా బాధాకరం” అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఆయనకు నెటిజన్లు ఘాటైన సమాధానాలు ఇస్తున్నారు. బూతులకు ఉగ్గు పోసి పెంచినట్లు ఉండే ‘మిర్జాపూర్’ వంటి సిరీస్‌లు, యువతను మద్యం, డ్రగ్స్ తీసుకునేలా ప్రోత్సహించేలా ఉన్న సినిమాలు ఎన్నో బాలీవుడ్‌లో వచ్చినా వాటిపై జావేద్ పెదవి కూడా విప్పలేదని, కానీ, ఇప్పుడు దక్షిణాది సినిమాలు మంచి కంటెంట్‌తో వచ్చి తమ సత్తా నిరూపించుకుంటంటే మాత్రం తట్టుకోలేకపోతున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు.

Read Also: ‘ప్రియాంక’ను ఒంటరిగా వ్యాన్‌లోకి రమ్మన్న డైరెక్టర్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Governor Jishnu Dev Varma | రైతుల అభివృద్దికి చర్యలు.. ముగిసిన గవర్నర్ ప్రసంగం..

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు...