ఆ డైట్ వల్లే శ్రీదేవి చనిపోయింది.. నాగార్జున చెప్పిన సీక్రెట్ వెల్లడించిన బోనీ కపూర్

-

Boney Kapoor – Sridevi | అలనాటి అందాల తార శ్రీదేవి మరణించి ఐదేళ్లు పూర్తయింది. అయినప్పటికీ ఆమెది సహజ మరణమా? హత్యకు గురైందా అనే అనుమానాలు మాత్రం అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె మృతిలో భర్త హస్తం ఉండొచ్చనే గుసగుసలు కూడా వినిపించాయి. అయితే ‘శ్రీదేవిది సహజ మరణం కాదు, ప్రమాదవశాత్తూ మరణించింది. కానీ నా పైన అనుమానంతో దుబాయ్ పోలీసులు నన్ను ఒకరోజంతా విచారించారు. నాకు లై డిటెక్టర్ పరీక్షలు కూడా నిర్వహించారు’ అని అందాల తార శ్రీదేవి మరణంపై ఆమె భర్త, నిర్మాత బోనీకపూర్ స్పందించారు. 2018లో ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే బాత్ టబ్ లో జారిపడి కన్నుమూశారు. ఆమె ఆకస్మిక మృతి వెనుక బోనీకపూర్ హస్తం ఉండి ఉండవచ్చని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా స్పందించారు.

- Advertisement -

భారతీయ మీడియా నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే పోలీసులు నన్ను విచారించారు. ఎలాంటి కుట్రకోణం లేకపోవడంతో వదిలేశారు.. అని బోనీకపూర్(Boney Kapoor) పేర్కొన్నారు. తెరపై నాజూగ్గా కనిపించాలనే కోరికతో స్ట్రిక్ట్ డైట్ పాటించడమే శ్రీదేవి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన అన్నారు. వైద్యులు వారించినా వినకుండా ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల ఆమె నీరసించి పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని బోనీ తెలిపారు. క్రాష్ డైట్ వల్ల ఓసారి షూటింగ్ లో శ్రీదేవి కళ్లు తిరిగి పడిపోయిందనీ, ఆమెకు ఓ పన్ను కూడా విరిగిందని శ్రీదేవి మరణానంతరం నాగార్జున(Nagarjuna) తనతో ఓ సందర్భంలో చెప్పారన్నారు. లోబీపీ సమస్య ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు శ్రీదేవికి చెప్పినా ఆమె లక్ష్యపెట్టలేదన్నారు.

Read Also: పేరెంట్స్ పిల్లలతో ఇలా ఉంటే కుటుంబానికి, సమాజానికి మేలు
Follow us on:  Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...