బుక్ మైషోకి కోవిడ్ కష్టాలు – ఎంతమందిని ఉద్యోగం నుంచి తీశారో తెలుసా

Book My Show Removed 200 members employees

0
100

మనం సినిమాకి వెళ్లాలంటే ఈ రోజుల్లో అంతా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ చేసుకుంటున్నాం. మన దేశంలో బుక్ మై షో వచ్చిన తర్వాత టికెట్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. అయితే ఈ కరోనా సమయంలో ఏడాదిన్నరగా చిత్ర సీమ ఎంతో దారుణమైన ఇబ్బందుల్లో ఉంది. కొత్త సినిమాలు విడుదల లేవు, దీంతో బుక్ మై షో కంపెనీపై కూడా ఎఫెక్ట్ పడింది.

ఆన్లైన్ టికెట్ బుకింగ్ వెబ్సైట్ బుక్ మై షోపై కోవిడ్ ఎఫెక్ట్ దారుణంగా పడింది. కరోనా వల్ల కొద్ది రోజులుగా కంపెనీ కార్యాకలాపాలు నిలిచిపోవడంతో రెండు వందల మంది ఉద్యోగులను బయటకు పంపింది కంపెనీ. బుక్ మై షో ఫౌండర్, సీఈవో ఆశీష్ హేమ్రజనీ ఈ విషయం తెలియచేశారు.

కరోనా ప్యాండమిక్ కష్టకాలంలో తామంతా కలిసికట్టుగా పని చేశామని, ఎంతో మందికి సేవలు అందించినట్టు ఆశీష్ తెలిపారు. అయితే ఇంకా పరిస్దితులు సాధారణం అవ్వలేదు. అందుకే 200 మంది ఉద్యోగులని వదులుకున్నామని ఎంతో బాధతో తెలిపారు. కంపెనీ వదులుకున్న ఉద్యోగులంతా నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన వారని, వారికి ఎవరైనా అవకాశం ఇవ్వండి అని ట్విట్టర్ లో తెలిపారు.1999లో ఆశీష్ హేమ్రజనీ బుక్మైషో ను ప్రారంభించారు. ఇలా కంపెనీ అంచెలంచెలుగా ఎంతో అభివృద్ది చెందింది. కానీ ఇప్పుడ కరోనా వల్ల చాలా ఎఫెక్ట్ పడింది కంపెనీపై.