బాలకృష్ణ తో దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే సింహ, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. బాలకృష్ణ కు మంచి హిట్లను అందించిన బోయపాటి శ్రీను ఈ ఇప్పుడు హైట్రిక్ విజయం పై కన్నేశాడు. ద్వారకా క్రియేషన్స్ పై బాలయ్య 160 చిత్రం మీర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు.
ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని టాక్. వచ్చే ఏడాది వేసవి కాలంలో ఈ సినిమ వెండితెరపైకి వస్తుందని పిఆర్ఓ బిఎ రాజు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఈ చిత్రా న్నీ ఆయన విడుదల చేశారు.