మొత్తానికి బోయపాటికి హీరోయిన్ దొరికేసింది

మొత్తానికి బోయపాటికి హీరోయిన్ దొరికేసింది

0
89

తెలుగు తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి అంజలి, తెలుగు పిల్ల అయినా ఆమె తమిళ్ లో కూడా పలు సినిమాలు చేసి మంచి హీరోయిన్ గా సక్సెస్ సినిమాలు చేసింది, హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.
ఇటీవల కాస్త మరిన్ని అవకాశాల కోసం బరువు కూడా తగ్గింది.

తెలుగు నుంచి ఒక భారీ సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అంజలికి, బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం మరోసారి వచ్చిందని అంటున్నారు. తాజాగా బాలయ్య సినిమాలో నటి అంజలికి ఛాన్స్ దక్కింది అని తెలుస్తోంది.

గతంలో బాలయ్య సినిమాలో ఆమె నటించింది. బాలకృష్ణ సరసన డిక్టేటర్ సినిమా చేసింది. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా బోయపాటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించనున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే కథానాయికల ఎంపికలో ఉన్నారు బోయపాటి. ఇక ఫ్రిబ్రవరి 15 నుంచి సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది, అయితే తాజాగా పలువురి పేర్లు వినిపించాయి కాని అంజలిని ఫైనల్ చేశారు అని తెలుస్తోంది.