వెన్నెల కిషోర్ కి కాదు సునీల్ కి ఛాన్స్ ఇచ్చిన బోయపాటి రీజన్ ఇదే

వెన్నెల కిషోర్ కి కాదు సునీల్ కి ఛాన్స్ ఇచ్చిన బోయపాటి రీజన్ ఇదే

0
83

కమెడియన్ నుంచి హీరోగా సునీల్ కొన్ని విజయాలు అందుకున్నారు.. తర్వాత మళ్లీ హీరోగా సినిమాలు మానేసి, కమెడియన్ అలాగే కీలక పాత్రలు చేసేలా నటిస్తున్నారు.అయితే సునీల్ లేని లోటు టాలీవుడ్ లో వెన్నెల కిషోర్ భర్తీ చేశారు అనే చెప్పాలి, దాదాపు సునీల్ ఆపాత్రలకు సెట్ అవుతారు. అయితే సునీల్ హీరోగా చేస్తూ ఉండటంతో వెన్నెల కిషోర్ వెంటే దర్శకులు సినిమాలు చేయించారు.

అయితే మళ్లీ ఇప్పుడు సునీల్ బ్యాక్ అయ్యారు, తాజాగా త్రివిక్రమ్ సినిమాలు..అరవింద సమేత .. అల వైకుంఠపురములో నటించారు. ఈ రెండు సినిమాలు సునీల్ కి బాగా హెల్ప్ అవుతాయని అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకులు ఎంతమాత్రం గుర్తుపెట్టుకోనివే కాని సునీల్ మళ్లీ తన కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు.

ఇక దర్శకులు కూడా కొన్ని చిత్రాలు చేసేందుకు సునీల్ ని సంప్రదిస్తున్నారు. తాజాగా బాలయ్య బాబుతో బోయపాటి సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో సునీల్ కి ఓ ముఖ్యమైన రోల్ ఇచ్చారట, దాదాపు బాలయ్య పక్కన ఉండే రోల్ అని తెలుస్తోంది.. సునీల్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తోంది. ముందు వెన్నెల కిషోర్ అని అనుకున్నారు కాని తర్వాత సునీల్ ని ఫిక్స్ చేశారు అని తెలుస్తోంది.