బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం

బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం

0
111

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు బోయపాటి శ్రీను అంటే తెలియని వారు ఉండరు. ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.
బోయపాటి శ్రీను మాతృమూర్తి సీతారావమ్మ అనారోగ్యంతో పెదకాకానిలో కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో సినిమా చిత్రీకరణలో ఉన్న బోయపాటి తల్లి మరణవార్తతో వెంటనే స్వగ్రామం బయల్దేరారు..ఆమె శుక్రవారం రాత్రి 7.22 గంటలకు మరణించారు.ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు బొయపాటి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నారు. బోయపాటి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడకు చేరుకుంటున్నారు.

బోయపాటి సినిమాల్లోకి రావడానికి ఆమె ప్రధాన కారణం అని చెబుతున్నారు కుటుంబ సభ్యులు.. ఆమె ప్రొత్సాహంతో ఆయన సినిమాల్లోకి వచ్చారు, ముందు సినిమాల్లోకి వెళతాను అంటే ఆమె ఆయనని వెన్నుదన్నుగా నిలిచారట, నేడు ఆయన సక్సెస్ కూడా ఆమె చూశారు, తన కొడుకు చాలా ఉన్నతమైన స్టేజ్ కు వెళ్లాడు అని ఆమె ఊరిలో అందరితో చెబుతూ ఉండేవారట.