దర్శకుడు బోయపాటి శ్రీను రియల్ స్టోరీ

దర్శకుడు బోయపాటి శ్రీను రియల్ స్టోరీ

0
92

టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు, మంచి కమర్షియల్ మాస్ సినిమాలకు ఆయన పేరు.. తీసిన సినిమాలు కొన్ని అయినా ఆయనకు అన్నీ హిట్లు వచ్చాయి, బోయపాటి శ్రీను 1971 ఏప్రిల్ 25న గుంటూరు జిల్లాలోని పెదకాకాని గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు లింగయ్య, సీతారావమ్మ. తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం వారిలో శ్రీను మూడవ బిడ్డ.

తండ్రి లింగయ్య వ్యవసాయం చేస్తూండగా, అన్నయ్య బ్రహ్మానందరావు ఫోటోస్టూడియో నిర్వహిస్తూండేవాడు.. ఆయన స్కూల్ డేస్ అన్నీ పెదకాకానిలో జరిగాయి.ఇంటర్మీడియట్, డిగ్రీ గుంటూరు జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాలలో చదువుకున్నాడు. డిగ్రీ దశలో అన్నయ్య ఫోటోగ్రఫీ స్టూడియో నిర్వహణలో సహాయం చేశారు, ఈనాడు పత్రికా విలేకరిగా పనిచేశారు. తర్వాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చరిత్ర పూర్తి చేశారు.

తర్వాత ఆయన 1994లో పోలీస్ ఎస్సై కావడానికి పరీక్షలు, ఫిజికల్ టెస్టులు పూర్తిచేశాడు. ఉద్యోగానికి ఎంపిక కూడా అయ్యాడు. అయితే ఏవో కారణాల వల్ల అందులో చేరలేదు. ఇక ఆయన బంధువు అయిన సినిమా రచయిత పోసాని కృష్ణ మురళి ఇంటికి వచ్చినప్పుడు, సినిమా రంగంలో దర్శకత్వ శాఖలో సిఫార్సు చేస్తానని చెప్పారు, అలా ఆయన దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గర దర్శకత్వంలో 1997 పనిచేశారు.

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన పెళ్ళి చేసుకుందాం, అన్నయ్య, గోకులంలో సీత వంటి సినిమాలకు వరుసగా దర్శకత్వ శాఖలో సహాయకునిగా శ్రీను పనిచేశాడు. అలా చిత్ర పరిశ్రమలో ఆయన దర్శకత్వంలో తొలి సినిమా 2005 మే 12న భద్ర విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆయన తీసిన చిత్రాల్లో సింహా, లెజెండ్ ఎంత సూపర్ హిట్ సినిమాలో తెలిసిందే.