తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు… వయసు రిత్య ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి… అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లో సందడి చేయనున్నారని వార్తలు వస్తున్నాయి…
- Advertisement -
ఆయనను పలు సినిమాల్లోకి తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి… తాజా సమాచారం ప్రకారం మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ ఆచార్య.. ఈచిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు… ఈ చిత్రంలో బ్రహ్మానందం కు ఒక కామెడీ పాత్ర ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు…
అదే విధంగా మషేబాబు నటిస్తున్న సినిమాలో కూడా ఆయనకు ఒక మంచి పాత్ర ఇవ్వనున్నారని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు… అయితే ఇందుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు…