స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. టాలీవుడ్, బాలీవుడ్ పాపులర్ నటులు రణబీర్ అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన తారాగణంతో దర్శకుడు ఆయున్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ’ పేరుతో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్రబృందం భారీగా సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీఫిల్మ్ సిటీ ఈ భారీ వేడుకకు వేదిక కానుంది. సెప్టెంబర్ 2న జరగనున్న ఈ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పణలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాయి.