సినిమాల‌కు గుడ్ బై – బ్రహ్మానందం క్లారిటీ

సినిమాల‌కు గుడ్ బై - బ్రహ్మానందం క్లారిటీ

0
104

ఈ మ‌ధ్య ఓ వార్త వైర‌ల్ అవుతోంది, హాస్య‌న‌టుడు బ్రహ్మానందం ఇక సినిమాల్లో న‌టించ‌ర‌ని, ఆయ‌న సీరియ‌ల్స్ చేయాలి అని అనుకుంటున్నారు అని సినిమాల‌కు గుడ్ బై చెబుతున్నారు అని అనేక వార్త‌లు వినిపించాయి, దీనిపై ఆయ‌న ఎక్క‌డా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.. కాని అంద‌రూ దీని గురించి చ‌ర్చించుకున్నారు.

దీనిపై బ్రహ్మానందం ఒక ప్రకటన చేశారు. కొంతమంది కామెడీ నటుల ప్రవేశం వల్ల ఆయన సినిమాలకు దూరంగా వున్నారు. హరితహారంలో మొక్కలు కూడా నాటారు ఆయ‌న‌. తాజాగా ఈ వార్త‌ల‌పై స్పందించారు, తాను ఎలాంటి సీరియల్స్‌లో నటించడం లేదు. గత మూడున్నర నెలలుగా నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడం లేదు. నేను ఇంట్లో ఉంటున్నాను.

ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చే ఆలోచ‌న లేదు, నా మ‌న‌వ‌డితో స‌మ‌యం నాకు స‌రిపోతోంది..నా కెరీర్‌ గురించి నేను ఇప్పుడు ఆలోచించడం లేదు అని చెప్పారు ఆయ‌న‌. అంతేకాదు ఆయ‌న మంచి డ్రాయింగ్ వేస్తారు పుస్త‌కాలు చ‌ద‌వ‌డం డ్రాయింగ్ తో నా స‌మ‌యం స‌రిపోతోంది అని చెప్పారు ఆయ‌న‌, మొత్తానికి సినిమాలు వ‌ద‌ల‌లేదు, సీరియ‌ల్స్ ఎక్క‌డా చేయ‌డం లేదు, ఇదంతా ఒట్టి రూమ‌ర్ మాత్ర‌మే.