బ్రహ్మానందం ఆ నిర్ణ‌యం తీసుకోలేద‌ట ?

బ్రహ్మానందం ఆ నిర్ణ‌యం తీసుకోలేద‌ట ?

0
101

సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు ఈ మ‌ధ్య వినిపిస్తున్నాయి, అందులో ముఖ్య‌మైన‌ది ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సినిమాల‌కు గుడ్ బై చెబుతున్నారు అని? ఆయ‌న ఇక సినిమాలు చేయ‌రు అని వార్త‌లు వ‌స్తున్నాయి, అయితే ఇందులో వాస్త‌వం లేదు అంటున్నారు చిత్ర ప్ర‌ముఖులు ఆయ‌న అభిమానులు, ఆయ‌న సినిమాలు చేయ‌ను అని ఎక్క‌డా చెప్ప‌లేద‌ని అంటున్నారు.

కొన్ని సినిమాలు మాత్ర‌మే చేస్తూ ప‌లు సీరియ‌ల్స్ లో కూడా న‌టించాలి అని ఆయ‌న భావిస్తున్నార‌ట‌.
ఆయ‌న టీవీ సీరియళ్ల వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారని వార్తలు వ‌స్తున్నాయి…

సీరియ‌ల్ ఎలా ఉన్నా బ్ర‌హ్మానందం సినిమాలు మాత్రం మాన‌రు అని అంటున్నారు, అంతేకాదు ఆయ‌న అభిమానులు ఇదే కోరుకుంటున్నారు, ఆయ‌న సీరియ‌ల్స్ లో న‌టించినా, ప‌లు సినిమాల్లో కూడా న‌టించి కామెడీ పండించాలి అని కోరుతున్నారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న చేసే వ‌ర‌కూ ఎలాంటి వార్త‌లు న‌మ్మ‌ద్దు అంటున్నారు బ్ర‌హ్మీ అభిమానులు.