తెలుగులో అనేక చిత్రాల్లో నటించి నవ్వుల రారాజుగా పేరు సంపాదించారు…ప్రముఖ నటుడు బ్రహ్మానందం, తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో తన వంతు సాయం అందించారు, సినిమా కార్మికులకు ఆయన సాయం చేశారు.
కరోనా క్రైసిస్ ఛారిటీ సీసీసీ కి రూ.3 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే సీసీసీకి అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు అందించారు, తాజాగా ఆయన కూడా ఈ నగదు అందించారు, ఇక దిల్ రాజు నిర్మాతగా అందరికి తెలిసిన వ్యక్తే… ఆయన కూడా తెలంగాణ సర్కారుకి 10 లక్షలు విరాళం అందించారు.
తాజాగా మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కు అందజేశారు.ఈ సమయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు సీసీసీకి అందించారు, మెగాస్టార్ పిలుపుతో టాలీవుడ్ కదిలి వచ్చింది.