బ్రేకింగ్ — ఏసుదాసు కుమారుడికి రోడ్డు ప్రమాదం

బ్రేకింగ్ -- ఏసుదాసు కుమారుడికి రోడ్డు ప్రమాదం

0
95

దేశంలోనే ఎంతో ప్రసిద్ద గాయకుడిగా పేరు సంపాదించిన ఏసుదాసు అంటే తెలియని వారు ఉండరు, తాజాగా ఆయన కుమారుడు కూడా పలు సినిమాల్లో పాటలు పాడారు, ఆయన కూడా గాయకుడుగానే కొనసాగుతున్నారు చిత్ర సీమలో..
తాజాగా గాయకుడు విజయ్ యేసుదాసు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమిళనాడులోని కోచిలో సోమవారం అర్ధరాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ వార్త తెలిసి అందరూ షాక్ అయ్యారు.

అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని తెలుస్తోంది. ఇరు కారుల్లో ఉన్నవారు బాగానే ఉన్నారు,
తిరువనంతపురం నుంచి కోచికి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరారు విజయ్. ఆ సమయంలో ఆయనే స్వయంగా కారు నడుపుతున్నారని సమాచారం.

అయితే రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఒక్కసారిగా కార్లు రెండూ ఢీ కొట్టాయి హైవే రోడ్డుపై …ఇక ఈ విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకున్నారు, అయితే తర్వాత వారు క్షేమంగా ఉండటంతో మరో కారులో వెళ్లిపోయారు. కాని ముందు భాగం మాత్రం కాస్త డ్యామేజ్ అయింది.