కొన్ని బంధాలు చాలా గట్టిగా ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వీడిపోవు, మరికొన్ని బంధాలు అసలు ఉన్నాయా లేదా అనేంతగా ఉంటాయి, అయితే సినిమా పరిశ్రమలో అందరూ అందరితో సరదాగా మంచిగా ఉండాలి లేకపోతే అవకాశాలు రావు అంటారు. ఇది నిజమే, అయితే బుల్లితెరలో రవి లాస్య యాంకర్లుగా ఎంతో మంచి ఫేమ్ సంపాదించారు, ముఖ్యంగా వీరిద్దరూ చేసిన షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి.
అందుకే యాంకర్లుగా వీరిద్దరిని సూపర్ జోడీ అని అంటారు, అయితే ఐదేళ్ల నుంచి వీరిద్దరూ కలిసింది లేదు ఎక్కడా షోలు చేసింది లేదు.. వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల వల్ల వీరు దూరం అయ్యారు.. అయితే తాజాగా ఓ ఛానల్ లో
చేస్తున్న సంక్రాంతి సంబరమే వీరిద్దరిని మరోసారి కలిపింది.
ఈ కొత్త ఏడాది చాలా గొప్పగా ఉంది. నెగటివిటీని చంపేసి, పాజిటివిటీ వైపు అడుగులు వేద్దాం. ఎర్రోళ్ల సంతోష్, పూజా రావు అనంత్ కి ధన్యవాదాలు. మా జోడీని స్క్రీన్ మీదకు మళ్లీ తెచ్చినందుకు. లాస్య కమ్ బ్యాక్ వేరే లెవల్లో ఉంది అని రవి పోస్ట్ చేశారు.. లాస్య కొడుకు జున్ను… రవి కూతురు కలిసి షేక్ హ్యాండ్స్ చేసుకోవడం చాలా బాగుంది..లాస్యకి రవి సారీ చెప్పాడు ఇద్దరూ ఫ్రెండ్ షిప్ బ్యాండ్లు కట్టుకున్నారు. ఇద్దరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
వీడియో ఇదే
https://www.instagram.com/p/CJieb8WBHti/