బ్రేకింగ్ – యాంకర్ శ్రీముఖిపై కేసు న‌మోదు

బ్రేకింగ్ - యాంకర్ శ్రీముఖిపై కేసు న‌మోదు

0
157
Actress Sreemukhi Latest Hot Photoshoot ULTRA HD Photos Anchor Srimukhi Images Stills

ఇటీవ‌ల బిగ్ బాస్ ర‌న్న‌ర్ గా నిలిచి జ‌స్ట్ టైటిల్ మిస్ చేసుకుంది ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖి, అయితే తాజాగా ఆమె మ‌ళ్లీ త‌న షోల‌తో బుల్లితెర‌లో బిజీ బిజీగా ఉంది, ప‌లు కొత్త షోలు కూడా ప్రారంభిస్తోంది, ఈ స‌మ‌యంలో శ్రీముఖి ఫ్యాన్స్ తో కూడా నిత్యం ట‌చ్ లో ఉంటోంది.

తాజాగా యాంక‌ర్ శ్రీముఖిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే దీనికి కార‌ణం ఓ టీవీ ఛానెల్ షో లో యాంకర్ గా వ్యవహరించిన శ్రీముఖి, బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్టు సమాచారం. అయితే ఇలాంటి కేసులు ఇటీవల చాలా న‌మోదు అవుతున్నాయి.

ఈ విష‌యంపై శ్రీముఖి పై కూడా కేసు న‌మోదుకావ‌డంతో అభిమానులు షాక్ అయ్యారు, అంతేకాదు శ్రీముఖితో పాటు సదరు టీవీ ఛానెల్ యాజమాన్యంపైనా హైదరాబాద్, నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి దీనిపై కేసు అయితే న‌మోదు అయింది. దీనిపై ఆమె ఏమ‌ని స్పందిస్తారో చూడాలి.