టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన పేరు గుర్తింపు ఉంది… మెగాస్టార్ చిరంజీవి నుంచి పవన్ కల్యాణ్ నాగబాబు తర్వాత సినిమా పరిశ్రమకు వచ్చారు.. ఇక తర్వాత చరణ్, బన్నీ కూడా ఎంట్రీ ఇచ్చారు, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్ ఇకఉప్పెనతో వైష్ణవ్ తేజ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక నిహారిక కూడా ఎంట్రీ ఇచ్చింది సినిమా పరిశ్రమకు.
ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి మరో హీరో రాబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి, మరి ఎవరు అని అనుకుంటున్నారా,
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బావమరిది కొడుకు ముత్తంశెట్టి విరాన్ . తాజాగా ఆయన నటించిన సినిమా
బతుకు బస్టాండ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ చూసిన వారు బాగుంది అంటున్నారు…అంతేకాదు ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి, ఇక ఈ సినిమాతో
విరాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా జూన్ 11న విడుదల కానుంది. మొత్తానికి మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వస్తున్నారు.