బ్రేకింగ్ – బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం

బ్రేకింగ్ - బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం

0
72

ఏదైనా చిన్న సమస్య వస్తే కొందరు వెంటనే ఆత్మహత్య చేసుకుంటున్నారు.. దీని వల్ల ఆ సమస్యలు మరింత పెరుగుతాయి కాని తగ్గవు, ఆ కుటుంబాన్ని ఒంటరి చేసి వెళ్లిపోతున్నారు, చిత్ర సీమలో ఇటీవల కొందరు ఒత్తిడి తట్టుకోలేక మరికొందరు అవకాశాలు రాక ఇలా ఆత్మహత్య చేసుకున్నారు, అయితే తాజాగా ఓ నటి ఇలా ఆత్మహత్య యత్నం చేసింది కాని అదృష్టం ఆమె వైద్యులు చికిత్సతో బతికింది.

 

కన్నడ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ చైత్ర కొట్టూరు సూసైడ్ అటెంప్ట్ చేసింది. కోలార్లోని తన ఇంట్లోనే ఆమె ఈ అఘాయిత్యం చేసుకుంది. ఇంట్లో వారు బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఫినాయిల్ తాగింది, వెంటనే స్దానికులు దీనిని గమనించి ఆమెని రక్షించారు. వైద్యులు ఆమెకి చికిత్స అందిస్తున్నారు.

 

 

ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు, అయితే ఆమె ఇలా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది విచారణ చేస్తున్నారు పోలీసులు. మరో విషయం 2021, మార్చి 28న నాగార్జున అనే బిజినెస్ మ్యాన్ను ఈమె పెళ్లి చేసుకుంది. అయితే తర్వాత నుంచి వీరిద్దరికి విభేదాలు వచ్చాయి అని టాక్ నడుస్తోంది. ఈమె బిగ్ బాస్ 7 కన్నడ సీజన్లో కంటెస్టెంట్. అ

సుజీదార అనే కన్నడ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.