పాత కాలెండర్ పోయి కొత్త కాలెండర్ వచ్చింది … అయినా మార్పు లేదు చిత్ర సీమలో విషాదాలు వెంటాడుతున్నాయి, ఇప్పటికే జనవరి 1 నుంచి రోజుకో విషాద వార్త వినాల్సి వస్తోంది.. తమిళ నిర్మాత కే బాలు.. గేయ రచయిత అనిల్ కరోనాతో కన్నుమూసారు. ఇక కరోనాతో మరో సినిమా దిగ్గజం కన్నుమూశారు.
ప్రముఖ కన్నడ నటుడు శని మహదేవప్ప కరోనాతో జనవరి 3న కన్నుమూశాడు. సీనియర్ నటుడిగా ఆయనకు ఎంతో పేరు ఉంది.. ఆయన వయసు 88 సంవత్సరాలు.. కరోనాతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.. ఈ సమయంలో ఆయన మరణించారు.. శని మహదేవప్పకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కొద్ది కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు వయోభారంతో.
ఇక ఆయన మరణంతో చిత్ర సీమలో దర్శకులు నిర్మాతలు నటులు సంతాపం తెలిపారు.. అప్పీ, భక్త కుంబర, శ్రీనివాస కళ్యాణ, కవిరత్న కాళిదాసలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు, ఇక కన్నడ లెజెండరీ నటుడు డా. రాజ్ కుమార్కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరు ఉంది.. ఆయన సినిమాలు అన్నింటిలో శని మహదేవప్ప నటించారు.