దేశంలో మార్చి నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది, ఈ సమయంలో ఆరు నెలలుగా అసలు సినిమా థియేటర్లు ఓపెన్ కాలేదు, ఆగస్ట్ సెప్టెంబర్ లో థియేటర్లు ఓపెన్ అవుతాయి అని కేంద్రం పర్మిషన్ ఇస్తుంది అని అందరూ భావించారు.. కాని కేంద్రం మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు.
తాజాగా సినిమా హాళ్లు, ఓపెన్-ఎయిర్ థియేటర్లు తిరిగి తెరచుకునేందుకు అనుమతిస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. అయితే కేంద్రం ఇంకా దీనిపై ఏ ప్రకటన చేయలేదు కాని బెంగాల్ సర్కారు మాత్రం కీలక ప్రకటన చేసింది.
సీఎం తాజా నిర్ణయంతో అక్టోబర్ 1 నుంచి థియేటర్లు తెరచుకోనున్నాయి. అన్ని మ్యూజికల్, డ్యాన్సింగ్ ఈవెంట్స్, మ్యాజిక్ షోలను అనుమతిస్తాం అన్నారు, అయితే మాస్కులు ధరించాలి, కోవిడ్ నిబంధనలు పాటించాలి, అయితే సినిమా థియేటర్లకైనా కేవలం 50 మంది మాత్రమే అనుమతిస్తున్నాం అని తెలిపారు. కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.