ఈ కరోనా మహమ్మారి ఎవరిని విడిచి పెట్టడం లేదు.. సాధారణ ప్రజల నుంచి సినిమా ప్రముఖుల వరకూ అందరిని ఇది భయపెడుతోంది, ఎవరికి సోకుతుందా అనే భయం అందరిలో ఉంది, ఇటీవల పలువురు చిత్ర ప్రముఖులు కూడా కరోనా సోకి మరణించారు.
తాజాగా కోలీవుడ్ లో విషాదం జరిగింది. ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, నటుడు వీ. స్వామినాథన్ (62) కరోనాతో కన్నుమూశారు. అయితే గత కొన్నిరోజులుగా కరోనా వైరస్‌తో స్వామినాథన్ బాధపడుతున్నారు, ఆయనని చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు కాని ఆయన సోమవారం మరణించారు.
అయితే 25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమతో ఆయనకు అనుబంధం ఉంది, ఎందరో సూపర్ స్టార్లతో సినిమాలు తీశారు.1994 నుంచి చిత్రాలు తీస్తున్నారు, కోలీవుడ్ నటులు అజిత్, విజయ్, కమల్ హాసన్, సూర్య, కార్తిక్ వంటి తమిళ స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. స్వామినాథన్ కుమారుడు అశ్విన్ కూడా తమిళ నటుడే. ఆయన మరణంతో చిత్ర ప్రముఖులు నటులు సంతాపం తెలియచేస్తున్నారు.