బ్రేకింగ్ — కరోనాతో తెలుగు సింగర్ మృతి

బ్రేకింగ్ -- కరోనాతో తెలుగు సింగర్ మృతి

0
94

ఈ కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు.. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో రోజూ ఏదో ఓ విషాదం వినాల్సి వస్తోంది, ఎవరో ఓ ప్రముఖుడ్ని బలి తీసుకుంటుంది ఈ కరోనా.. తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం జరిగింది..

తాజాగా సీనియర్ గాయకుడు కరోనా తో కన్నుమూశారు. సీనియర్ గాయకుడు జి.ఆనంద్ గత రాత్రి కరోనాతో కన్నుమూశారు.

 

ఒక్కసారిగా టాలీవుడ్ ప్రముఖులు ఈ వార్త విని షాక్ అయ్యారు..ఆయన వయసు 67 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది.. దీంతో ఆయన ఇంటి పట్టున ఉండి చికిత్స తీసుకుంటున్నారు.. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించింది, ఆయన మరణించారు.. ఆయనది ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా తులగమ్ గ్రామం.

 

ఒక వేణువు వినిపించెను–దిక్కులు చూడకు రామయ్య-విఠలా విఠలా పాండురంగ విఠలా ఇలాంటి వందల పాటలు పాడారు.. భక్తి కుటుంబం ప్రేమ ఇలా ఏ పాటలు అయినా అద్బుతంగా పాడతారు… సుమారు ఆయన ప్రపంచ వ్యాప్తంగా 6000 పైగా కచేరీలు చేశారు… తెలుగులో పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు సీరియల్స్ కు సంగీతం ఇచ్చారు.